అంధుడి పాత్రలో బన్నీ‌!

టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్‌ లో ‘ఐకాన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘కనుబడుట లేదు’ అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనివార్య కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. ‘పుష్ప’ మొదటి భాగం పూర్తైన తర్వాత ‘ఐకాన్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

‘ఐకాన్’ సినిమాలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ‘కనుబడుట లేదు’ అనే ఉపశీర్షిక కు తగ్గట్లుగా బన్నీకి నిజంగానే కళ్ళు కనిపించవని అంటున్నారు. ఈ క్రమంలో ‘ఐకాన్’ సినిమాతో ఫస్ట్ టైం ప్రయోగాత్మక రోల్ చేయబోతున్నాడని వినికిడి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates