HomeTelugu Trendingచిరంజీవి కలిని ప్రకాశ్‌ రాజ్‌.. ఫొటో వైరల్‌

చిరంజీవి కలిని ప్రకాశ్‌ రాజ్‌.. ఫొటో వైరల్‌

Prakash raj meets chiranjee

మెగాస్టార్ చిరంజీవిని న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవితో తీసుకున్న ఫొటోను ఆయ‌న త‌న సోషల్‌ మీడియా లో షేర్‌ చేశారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చిరంజీవి చూపుతోన్న చొర‌వ ప‌ట్ల ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

‘ఉద‌యాన్నే బాస్ తో జిమ్ లో స‌మావేశ‌మ‌య్యాను. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతోన్న చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను. అన్న‌య్య మాకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అంటూ ఆయన రాసుకొచ్చారు.. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రకాశ్ రాజ్ కు నాగబాబు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. త‌మ‌కు చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయ‌ని నాగ‌బాబు చెప్పారు. తాజాగా చిరును కలవడం పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu