HomeTelugu Trendingప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా ప్రకటన రేపు

ప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా ప్రకటన రేపు

Prasanth varma 4th movie an

టాలీవుడ్‌లో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్.. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో క‌ల్కి అనే చిత్రం చేశాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక తాజాగా జాంబీ రెడ్డి అనే సినిమాని తెర‌కెక్కించాడు. వెండితెర‌పైనే కాదు బుల్లితెరపై కూడా ఈ మూవీ స‌త్తా చాటుతుంది.

ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో సినిమాకు సంబంధించి కొన్నాళ్ల నుండి జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ #PV4 ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. రేపు దర్శకుడి పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రకటించిడంతో పాటుగా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారట. అలాగే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ఓ పోస్టర్ ద్వారా ప్రకటిస్తారట. ఈ అనౌన్స్‌మెంట్ చూస్తుంటే ‘#PV4’ చిత్రాన్ని కూడా న్యూ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu