HomeTelugu Trendingడంకీ మూవీపై అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

డంకీ మూవీపై అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

sharuk Dunki movie

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ జవాన్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్న చిత్రం డంకీ. ఈ చిత్రంలో షారుక్ సరసన తాప్సీ ప‌న్ను కీలక పాత్ర పోషిస్తోంది.

షారుక్ డంకీ మూవీ టీజర్ గురించి సలార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ అదిరిపోయే అప్‌డేట్ అందించాడు. సలార్‌ ట్రైలర్‌ గురించి ఎందుకు అప్‌డేట్ చేయలేదని అందరూ నన్ను అడుగుతారు.. కానీ నేను అప్‌డేట్‌ చేయలేను.. షారుఖ్‌ఖాన్‌ సార్‌కి కాల్ చేశా. తన పుట్టినరోజున డంకీ టీజర్ వస్తుందని చెప్పారు. టీజర్‌ 56 సెకన్లు ఉంటుంది. నేను నా టీజర్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు సలార్ ట్రైలర్‌ని అప్‌లోడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది సలార్‌ వర్సెస్ డంకీ కాదు.. సలార్-డంకీ.. అని షారుఖ్‌ ఖాన్‌ చెప్పారని ట్వీట్ చేశాడు ప్రశాంత్‌ నీల్‌.

ప్రశాంత్ నీల్ చెప్పేదేమిటంటే డంకీ టీజర్‌ విడుదలయ్యాక సలార్ ట్రైలర్ వస్తుందని. ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ అందించి అటు షారుక్ ఫ్యాన్స్‌, ఇటు ప్రభాస్‌ అభిమానులు ఖుషీ అయ్యేలా చేస్తున్నాడు ప్రశాంత్‌ నీల్‌. డంకీ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబ‌ర్ 22న సలార్‌తోపాటు డంకీ గ్రాండ్‌గా థియేట‌ర‌ల్లో విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!