ప్రియాంకా చోప్రా సినిమాలో నాని!

బాలీవుడ్ అగ్రతార ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు వుడ్ లను అమ్మడు బానే కవర్ చేస్తోంది. అంతేనా.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తన బిజినెస్ అన్ని బాషల్లో రాణించాలని ఇతర బాషల్లో కూడా సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ముందుగా పంజాబీ, మరాఠీ సినిమాలను నిర్మిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంకా కన్ను తెలుగు సినిమాలపై పడినట్లు సమాచారం.
 
తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరోల లిస్ట్ రెడీ చేసుకొని సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉందని టాక్.అందులో హీరో నాని పేరు మొదట ఉందట. ఆమె తెలుగులో నిర్మించబోయే తొలి సినిమాలో హీరో నాని కావొచ్చనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాని వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. నేను లోకల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. శివ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ నేపధ్యంలో ఆయన ప్రియాంకా చోప్రా సినిమాలో నటించడానికి కాస్త సమయం పట్టొచ్చు.