ఇకపై దానికి సిద్ధం ఉంటున్న నయనతార.. నిర్మాతలు ఫుల్ ఖుషి!


స్టార్‌ హీరోయిన్‌ నయనతార.. కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అయితే, గత కొంతకాలంగా స్కిన్ షోకు ఆమె చాలా దూరంగా ఉంటున్నది. సంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకుంటూ కనిపిస్తోంది. కానీ.. హీరోయిన్ అంటే గ్లామర్ గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయి. ఈ విషయంలో నయనతార మొన్నటి వరకు వేరు, కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. క్రమంగా ఈ భామకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

దీంతో నయనతార ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో గ్లామర్ గా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపై చేసే సినిమాల్లో గ్లామర్ గా కనిపించాలని, స్కిన్ షో చేసేందుకు రెడీగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చిందిట నయనతార. ఈ సంకేతాలు ఇవ్వడంతో కోలీవుడ్ నిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారు. నయనతారను బుక్ చేసుకోవడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారట. పనిలోపనిగా నయన్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు.