కార్మికుల సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ ఎండీకి నోటీసులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది… ఈ నెల 25వ తేదీన వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చింది కమిషన్‌.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రకటించిందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓ బీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో 20 వేల మందికి పైగా బీసీలు ఉన్నట్టు తెలిపారు.. వారతంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు జేఏసీ నేతలు.