HomeTelugu Big Stories'పొన్నియన్‌ సెల్వన్‌'-1 ట్రైలర్‌ విడుదల

‘పొన్నియన్‌ సెల్వన్‌’-1 ట్రైలర్‌ విడుదల

PS1 Telugu Trailer

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రోజెక్ట్‌గా తెరక్కెకుతున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. హిస్టారికల్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న ఈ సినిమా ‘పార్ట్ -1’ ట్రైలర్‌ విడుదలైంది. సెప్టెంబర్ 6 మంగళవారం నాడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో సహా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. రానా వాయిస్ ఓవర్ తో తెలుగు ట్రైలర్ ప్రారంభమైంది. ఈ కథ రాజ్యాధికారం కోసం కిరీటం కోసం పోరాటం నేపథ్యంలో సాగనుంది. యువరాజు ఆదిత్య కరికాలన్ నుండి సందేశాన్ని అందించడానికి చోళ రాజ్యానికి వెళ్లిన వంతీయతేవన్ చుట్టూ కథాంశం తిరుగుతుంది.

1954లో ప్రచురించబడిన కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి రెండు నవలల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. హీరో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తీ, శోభితా ధూళిపాళ, శరత్ కుమార్. ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, శరత్ కుమార్, పార్థిబన్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, జయరామ్, జయచిత్ర రెహమాన్ అశ్విన్ కాకుమాను కిషోర్ నిజల్గల్ రవి మరియు వినోదిని తదితరులు నటిస్తున్నారు. AR రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా తమిళం- మలయాళం- కన్నడ- తెలుగు- హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu