బాలయ్యకి కోపం వచ్చేసింది..!

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’. ఈ సినిమాలో
శ్రియ, హేమ మాలిని వంటి తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక
సన్నివేశాల షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. అయితే ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఫోటోలు కొన్ని ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. హేమమాలిని,
శ్రియ, బాలకృష్ణలు ఉన్న ఫోటోలు నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం
బాలయ్యకు బాగా కోపం తెప్పించిందట. ఇకపై ఇలా జరగకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు
తీసుకోమని బాలయ్య, దర్శకుడు క్రిష్ కు ఆదేశాలను జారీ చేశాడు. క్రిష్ కూడా ఈ విషయంలో
మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. షూటింగ్ స్పాట్ కు ఎవరు ఎలక్ట్రానిక్
వస్తువాలను తీసుకు రాకూడదని హుకూమ్ జారీ చేశాడు.

CLICK HERE!! For the aha Latest Updates