HomeTelugu Newsసైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా 'భేతాళుడు'!

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా ‘భేతాళుడు’!

విజయ్ ఆంటోని హీరోగా మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘భేతాళుడు’. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీని బోయ‌పాటి శ్రీను విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేసి విజ‌య్ ఆంటోనికి అందించారు. ఈ సంద‌ర్భంగా..
బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. ”సినిమా అనేది స్టేజ్‌పై మాట్లాడ‌కూడ‌దు. స్క్రీన్‌పై మాట్లాడాల‌ని న‌మ్మే వ్య‌క్తిని నేను. అలాంటి తెర‌పై మాట్లాడిన సినిమా ‘బిచ్చ‌గాడు’. ఇప్పుడు అదే త‌ర‌హాలో విజ‌య్ ఆంటోని చేసిన భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య్ ఆంటోని మంచి కాన్సెప్ట్ మూవీల‌నే చేయాల‌నుకుంటాడు. మంచి స‌బ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకుంటాడు. మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎక్క‌డి నుండి వ‌చ్చినా మ‌న తెలుగు ప్రేక్ష‌కులు గుండెల్లో పెట్టుకుంటారు. భేతాళుడు కూడా అలాంటి కాన్సెప్ట్ ఫిలిం అవుతుంద‌ని ఆశిస్తున్నాను” అన్నారు.
యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ మాట్లాడుతూ.. ”1968లో నేను రాసిన మొద‌టి క‌థ భేతాళుడు. ఇప్పుడు అదే టైటిల్‌తో విజ‌య్ ఆంటోని సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. విజ‌య్ ఆంటోని డా.స‌లీమ్ సినిమా చూసి త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టుడు. తెలుగులో ఇలా సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టులు చాలా త‌క్కువ‌గా ఉన్నారు” అని అన్నారు.
విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ.. ”నేను చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో భేతాళుడు సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల నుండి ఇంత పెద్ద ఆద‌ర‌ణ‌ను ఎదురుచూడ‌లేదు. సాధార‌ణంగా నాకు ఇంత మంచి గుర్తింపు, ఆద‌ర‌ణ ఏ ఇర‌వై ఐద‌వ సినిమాకు వ‌స్తుంద‌ని అనుకున్నాను. అయితే నా మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. భేతాళుడు క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
ఫాతిమా విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ.. ”న‌కిలీ, డా.స‌లీం చిత్రాలు తెలుగులో మంచి స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బిచ్చ‌గాడు సినిమా ముందు త‌మిళంలో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. అయితే తెలుగులో, త‌మిళ్ కంటే పెద్ద హిట్ అయ్యింది. బిచ్చ‌గాడుతో విజ‌య్ ఆంటోని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఈ సినిమాతో మరింత దగ్గరవుతారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రామ‌కృష్ణ మాట్లాడుతూ.. ”ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం భేతాళుడు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. ఇంత మంచి సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోని, ఫాతిమా ఆంటోనిగారికి థాంక్స్‌. మంచి టీం స‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu