భారీ బడ్జెట్‌తో నాని కొత్త సినిమా!

నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలు అని మీడియం బడ్జెట్ తో తెరకెక్కినవే. ఎంత పెద్ద బడ్జెట్ అనుకున్నా.. రూ.30 కోట్లకు మించి లేదు. జెర్సీ సినిమా కూడా మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే కావడం విశేషం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. దీనికి శాటిలైట్ రైట్స్ అదనం.

విక్రమ్ కుమార్ తో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను కేటాయించారట. నాని సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇది నాని కెరీర్లో భారీ బడ్జెట్ అని చెప్పాలి. బడ్జెట్ పెరిగిపోయివడంతో.. నానిపై ఒత్తిడి మొదలైంది. అటు విక్రమ్ కుమార్ పై కూడా ఒత్తిడి ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. నిర్మాతల నమ్మకాన్ని నాని.. విక్రమ్ కుమార్ లు నిలబెడతారా చూద్దాం.