‘డిస్కోరాజా’ మేకింగ్‌ వీడియో 2

టాలీవుడ్‌ మాస్‌మహారాజ.. రవితేజ ఎనర్జీ గురించి తెలిసిందే. రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డిస్కోరాజా’. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్య హోప్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రెండో మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. వెండితెరపైనే కాదు, సెట్‌లో రవితేజ సందడి చేస్తూ కనిపించారు. రవితేజతో కలిసి నభా నటేశ్‌ ఇంకాస్త ఎక్కువ అల్లరి చేసినట్లే కనిపిస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.