HomeTelugu Trendingబిగ్‌బాస్‌ షో గురించి పునర్నవి షాకింగ్‌ కామెంట్స్‌..

బిగ్‌బాస్‌ షో గురించి పునర్నవి షాకింగ్‌ కామెంట్స్‌..

6 24
పునర్నవి ఈ పేరు బిగ్‌బాస్ షో తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన విషయం తెలిసిందే. పునర్నవి సినిమాల్లో నటించింది తక్కువే అయినా సినిమా కంటే బిగ్‌బాస్‌ ద్వారానే పాపులారిటీ సంపాదించింది. బిగ్‌బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్‌తో కోపాలు, తాపాలు, ప్రేమ, స్నేహం ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరి షో ఎక్కువగా జనాల్లోకి వెళ్లిందని చెప్పొచ్చు. అయితే అప్పట్లో దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయని పునర్నవి భూపాళం తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్‌ షో మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని అంటోంది. లోపల ఏం జరిగినా వాళ్లకు ఏది కావాలో అది మాత్రమే చూపిస్తారంటూ బాంబు పేల్చింది. అది చూసి జనాలు అదే నిజమనుకుంటారని అంది. కానీ హౌస్‌మేట్స్ అందరం టచ్‌లో ఉంటున్నామని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది. ఈవెంట్లకు అందరినీ పిలుస్తారని నాకు వీలుని బట్టి వెళ్తుంటానని పునర్నవి తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu