HomeTelugu Trendingపెళ్లి కాదు ప్రచారమే

పెళ్లి కాదు ప్రచారమే

Punarnavi Clarity on Weddin
తెలుగు బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పున‌ర్న‌వి. తాజా ఈ అమ్మడు ప్రాజెక్ట్ ప్ర‌మోష‌న్ కోసం స‌రికొత్తగా చేసింది. త‌న‌కు ఎంగేజ్‌మెంట్ అయిందని, కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప‌లు పోస్ట్‌లు చేసింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పునర్నవి మీద నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. రాహుల్‌ని టాగ్‌ చేసి పలు ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై రాహుల్‌ కూడా స్పందించాడు.. ఎవరికో పెళ్లి అయితే నన్ను ఎందుకు టాగ్‌ చేస్తున్నారా అన్నాడు. మరికొత్త మంది మాత్రం పున‌ర్నవికు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

కానీ ఇందతా.. త‌ను చేస్తున్న తాజా వెబ్ సిరీస్ కోసం చేశాను అని చెప్పింది. పున‌ర్న‌వి, ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌మిట్‌మెంట‌ల్ అనే వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఆహాలో న‌వంబ‌ర్ 13 నుండి ప్ర‌సారం కానున్న ఈ కార్య‌క్ర‌మంలో ఫ‌ణి అనే పాత్ర‌లో ఉద్భ‌వ్, అను అనే పాత్ర‌లో పునర్నవి క‌నిపించ‌నుంది. దీనికి సంబంధించిన వివ‌రాలు కూల్‌గా చెప్పిన పున‌ర్న‌వి. త‌ప్ప‌లేక ఒప్పుకున్నాను. ఇక ముందు ఉంది అస‌లైన క్రేజీ రైడ్ అంటూ క‌మింట్‌మెంటల్ షో వివ‌రాల‌ను త‌న పోస్ట్‌లో
పొందుప‌రిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!