HomeTelugu Newsవెబ్‌సిరీస్‌లోకి పునర్నవి?

వెబ్‌సిరీస్‌లోకి పునర్నవి?

11 6
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ స్నేహితురాలిగా చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శర్వానంద్ మూవీ మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో నటించింది. సినిమాల కంటే బిగ్‌బాస్‌ ద్వారా పునర్నవికి మంచి గుర్తింపు వచ్చింది. నాగార్జున హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ సీజన్‌-3 ద్వారా బాగా పాపులర్ అయింది. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆన్‌ స్ర్కీన్ రొమాన్స్ పండించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కాస్త గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అల్లు అరవింద్‌కు చెందిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ రూపొందించే వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu