ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’కు బాలకృష్ణ ముఖ్య అతిధి..!

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్ చివరిదశకు చేరుకున్నది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరాను మిస్ కాకూడదని చిత్రయూనిట్‌ కష్టపడుతున్నది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో షాక్ తిన్నాడు ఎన్టీఆర్. ఆ షాక్ నుంచి కోలుకుంటూనే షూటింగ్ కు హాజరవుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20 వ తేదీన అరవింద సమేత ఆడియో వేడుకను నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది. హైటెక్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నారు.

ఈ మూవీ ఆడియో వేడుకకు హాజరు కావాలని ఎన్టీఆర్.. బాబాయి బాలకృష్ణను రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. అందుకు బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పారట. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఒకే వేదికపై బాబాయ్‌, అబ్బాయ్‌ లు కనిపిస్తే.. ఇక నందమూరి ఫ్యాన్స్ కు పండుగే.