HomeTelugu Newsరామ్, పూరీల మూవీకి ఆసక్తికరమైన టైటిల్‌..!

రామ్, పూరీల మూవీకి ఆసక్తికరమైన టైటిల్‌..!

4 2ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినీ నటి ఛార్మి ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఈ హై వోల్టేజ్‌ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీకు మోషన్‌ పోస్టర్‌ నచ్చిందనే అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. స్టైలిష్‌గా కనిపిస్తూ దమ్ము కొడుతున్నట్లుగా ఉన్న రామ్‌ లుక్‌ను రివర్స్‌గా చూపించారు. పోస్టర్‌పై డబుల్‌ సిమ్‌ కార్డ్‌ అని రాసుంది. ఇప్పటివరకు రామ్‌ నటించిన సినిమాల నుంచి ఇంత ఆసక్తికరమైన పోస్టర్‌ ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. ఇందులో రామ్‌ బ్యాడ్‌ బాయ్‌గా కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. తాను పూరీతో సినిమా చేస్తున్నానని ప్రకటించినప్పుడు.. ‘ఎప్పుడూ మంచి బాలుడిగా నటించి బోర్‌ కొట్టేసినప్పుడు బ్యాడ్‌బాయ్‌గా నటిస్తాం’ అని పేర్కొన్నారు. ఇప్పుడు పోస్టర్‌ విడుదల చేస్తూ కూడా.. ‘హైదరాబ్యాడీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల నుంచే చిత్రీకరణ మొదలుకానుంది. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu