HomeTelugu TrendingPushpa 3: సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైటిల్‌

Pushpa 3: సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైటిల్‌

Pushpa 3 movie title viral Pushpa-3 movie title viral in social media,Pushpa-3,Allu Arjun,SukumarPushpa 3: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప-2 చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ‘పుష్ప’ రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి గాను హీరో, సంగీత దర్శకుడు నేషనల్‌ అవార్డులు కూడా వచ్చాయి.

దీంతో పుష్ప-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే ఇటీవలే పుష్ప పార్ట్‌-3 కూడా ఉంటుంది అని అల్లు అర్జున్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ ఈవెంట్లో పాల్గొన్న బన్నీ.. అన్నీ అనుకూలంగా ఉంటే పార్ట్‌3 తీసే అవకాశాలున్నాయన్నారు.

కథను కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనిని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలున్నాయని.. ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుందన్నారు. బన్నీ ఈ సినిమాలో రగ్‌డ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయాలను చెప్పినప్పటి నుంచి మూడో భాగానికి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. రోజుకో వార్త సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ‘పుష్ప: ది రోర్‌’ అనే టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం బన్నీ, సుకుమార్‌లు మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై చర్చలు కూడా జరిపారట. మొదటి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్‌’తో ప్రారంభించిన చిత్రబృందం దానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ను రూపొందిస్తున్నారు. దాని తర్వాత ‘పుష్ప: ది రోర్‌’ పేరుతో పార్ట్‌3 తెరకెక్కించి కథను ముగించనున్నట్లు టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu