మోహన్‌ బాబు తల్లి మృతి

ప్రముఖ సీనియర్‌ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి ఎ.రంగంపేట సమీపంలోగల మోహన్ బాబు విద్యాసంస్థలు విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. తల్లి మరణ వార్త విని మోహన్ బాబు సహా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరారు. మరికాసేపట్లో వారంతా విద్యానికేతన్ కు చేరుకోనున్నారు. మంచులక్ష్మమ్మ మరణంతో విద్యానికేతన్ ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన నానమ్మ మరణవార్త విని మంచు మనోజ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానమ్మ. ఈ సమయంలో నేను భారతదేశంలో లేకపోవడం బాధకలిగిస్తోంది. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.