HomeTelugu Big Stories'పుష్ప' పార్ట్‌-1 రిలీజ్‌ డేట్‌ ప్రకటన

‘పుష్ప’ పార్ట్‌-1 రిలీజ్‌ డేట్‌ ప్రకటన

Pushpa movie release date a

డైరెక్టర్‌ సుకుమార్‌- ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నారు మేకర్స్‌. అయితే క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీని డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు తెలిపింది మూవీ టీం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu