షూటింగ్ కు సిద్ధంగా బాలయ్య సినిమా!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 3 నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది.
బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. “శ్రీరామరాజ్యం, సింహా” వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ను నిర్మించాం. ఆగస్ట్ 3 నుండి 30 రోజులపాటు ఇక్కడే చిత్రీకరణ జరగనుంది, కీలకపాత్రధారులతో కీలకసన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు” అన్నారు.