HomeTelugu Trending'పుష్ప' ట్రైలర్‌

‘పుష్ప’ ట్రైలర్‌

Pushpa Official Trailer

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు ఫ్యాన్స్‌ కోరిక మేరకు ట్రైలర్ ని విడుదల చేశారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేపుతోంది. ‘పుష్పరాజ్’ గా బన్నీ మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

శేషాచలం అడవుల్లో అరుదుగా దొరికే ఎర్రచందనం చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అక్కడి వారు బతుకుతూ ఉంటారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా పుష్పరాజ్ పనిచేస్తుంటాడు.. వాటిని పోలీసులకు తెలియకుండా రాష్ట్రం దాటిస్తూ ఉంటాడు.. వీరిద్దరికి మధ్య జరిగే యుద్ధమే పుష్ప.. పోలీసులకు, స్మగర్లకు మధ్య రాజకీయ నాయకులు, దళారులు ఎలా వీరిని వాడుకున్నారు అనేది చూపించారు. ఇక మధ్యలో పుష్ప, శ్రీవల్లీల రొమాన్స్ ఆకట్టుకొంటుంది. ఇక చివర్లో ఫహద్ ఫాజిల్ పార్టీ లేదా పుష్ప అంటూ వెటకారంగా అన్న డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. బన్నీ మాస్ అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునీల్ , అనసూయ , రావు రమేష్ పాత్రలు విలనిజాన్ని మారుపేరుగా కనిపించాయి. ఫహద్ ఫాజిల్ ని ఒక ఫ్రేమ్ లో చూపించినా అతని పాత్ర ఎలాంటిదో తెలిసిపోతుంది. మొత్తానికి పుష్ప ట్రైలర్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu