HomeTelugu Trendingమాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: 'రా రా రెడ్డి' సాంగ్‌ ప్రోమో

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: ‘రా రా రెడ్డి’ సాంగ్‌ ప్రోమో

Ra Ra Reddy..Song Promo fr

టాలీవుడ్‌ హీరో నితిన్‌ న‌టిస్టున్న తాజా చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ సినిమాలోని ‘రా రా రెడ్డి’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు.

‘రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. నితిన్, అంజ‌లి మాస్ బీట్‌ స్టెప్స్ అల‌రిస్తున్నాయి. ఈ ఫుల్ సాంగ్ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. నితిన్ ఈ సినిమాలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu