HomeTelugu Big Storiesరాధేశ్యామ్‌ గ్లింప్స్‌

రాధేశ్యామ్‌ గ్లింప్స్‌

Radhe Shyam Telugu Glimps

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరి ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. గోపికృష్ణా మూవీస్,యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న ‘గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్’ వస్తుందని ప్రకటించడంతో ఈ చిత్ర గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్‌’ గ్లింప్స్‌ ను విడుదల చేశారు.

‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..!? ఛాహ్.. వాడు ప్రేమకోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు’ అనే సంభాషణ ఆకట్టుకుంటుంది. ప్రభాస్, పూజా జోడి స్క్రీన్ పైఅందంగా కనిపించింది. జులై 30న ‘రాధేశ్యామ్‌’ థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu