ఆరోజు పవన్ నవ్వుకి కారణమిదే!

ఇటీవల ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు అలీ ఏదో అనడం దానికి పవన్ పగలబడి నవ్వడం అందరినీ ఆకర్షించింది. పవన్ అంతలా నవ్వఇటీవల ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు అలీ ఏదో అనడం దానికి పవన్ పగలబడి నవ్వడం అందరినీ ఆకర్షించింది. పవన్ డానికి కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఒక్కొక్కరు తమకు తోచింది వాళ్ళు చెప్పారు. కానీ పవన్ అలా నవ్వడానికి అసలు కారణం ఏంటో.. అలీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
”పవన్ అలా నవ్వడం ఇంత హాట్ టాపిక్ అవుతుందని అనుకోలేదు. ఆరోజు శరత్ మరార్ గారు పవన్ ను పొగుడుతూ చాలా సేపు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ గురించీ.. ఆయన లుక్ గురించి పొగిడారు. నేను సడెన్ గా ‘మళ్ళీ పెళ్లి గానీ చేస్తాడా ఏంటి..? అన్నాను. అది పవన్ విని నవ్వు ఆపుకోలేకపోయారు” అంటూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ మీద అలీ జోక్స్ వేయడం.. ఆ జోక్స్ ను పవన్ ఎంజాయ్ చేయడం బట్టి వీరిద్దరి మధ్య స్నేహం ఎలాంటిదో.. అర్ధం అవుతుంది!
 
 
Attachments