HomeTelugu Trending'రాధేశ్యామ్‌' షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

Radhe shyam shooting gandik

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను పెంచాయనే చెప్పాలి.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న‘రాధేశ్యామ్‌’ ప్ర‌స్తుత షెడ్యూల్‌ కడప జిల్లాలోని గండికోటలో షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో వేద పాఠ‌శాల‌కు చెందిన గురువుగా స‌త్య‌రాజ్ నటిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కొంద‌రు అఘోరాల‌తో పాటు కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి భారీగాచేరుకుంటున్నారు షూటింగ్‌ను వీక్షిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu