HomeTelugu Trendingరాధికా ఆప్టే కోసం లండన్‌లో క్యూ కట్టిన అభిమానులు

రాధికా ఆప్టే కోసం లండన్‌లో క్యూ కట్టిన అభిమానులు

5 21
కరోనా లాక్‌డౌన్ కారణంగా బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే భర్తతోపాటు లండన్‌లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను లండన్ ప్రజలు గుర్తుపడుతున్నారని, తనను చూసేందుకు తన ఇంటిముందు వేచిచూస్తున్నారని చెప్పుకొచ్చంది. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వెబ్‌ సిరీస్‌లను ఆదరిస్తున్నారు. అందుకే నన్ను గుర్తుపడుతున్నారు. అంతేకాకుండా నన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు, గతంలో ఇలా జరగలేదు అంటోంది. ప్రజలు, అభిమానులు ఎక్కువ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే కొద్దిగా అసౌకర్యంగా ఉంటుందని చెప్పింది. ఎవరైనా తన వద్దకు వచ్చి తన నటన బాగుందని మెచ్చుకుంటే ఆనందిస్తానంటోది. అంతేకానీ రోడ్లపై పెద్దగా నా పేరు పిలవడం, లేనిపోని ఆర్భాటం చేయడం అంటే తనకు నచ్చదని చెప్తోంది. అలాంటి సంఘటనలు తాను చాలా ఎదుర్కొన్నానని కొన్ని ఉదాహరణలు కూడా వివరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu