HomeTelugu Trendingనేను ఆ పాత్రలు చేయాడానికే ఇండస్ట్రీకి రాలేదు: రాధికా ఆప్టే

నేను ఆ పాత్రలు చేయాడానికే ఇండస్ట్రీకి రాలేదు: రాధికా ఆప్టే

11 1
హాట్‌ బ్యూటీ రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో కూడా అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా కూడా గతంలో మాదిరి దూకుడు చూపించట్లేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. రక్త చరిత్ర, లెజెండ్, లయన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను చేరువైంది ఈ బాలీవుడ్ భామ. అయితే కెరీర్‌లో ఇప్పటి వరకు ఈమె బోల్డ్ కారెక్టర్స్ బోలెడు చేసింది. ముఖ్యంగా న్యూడ్ సీన్స్ చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు రాధిక ఆప్టే.

బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నగ్నంగా కూడా నటించి సంచలనం సృష్టించింది రాధిక. తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఓ దర్శకుడు ఈ మధ్యే తన దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడని.. అందులో తనది వేశ్య పాత్ర అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రాధిక. ఎందుకు ఇలాంటి పాత్ర చెప్తున్నావంటే.. మీరు నటించిన బద్లాపూర్, అహల్య లాంటి సినిమాల్లో ఎలాగూ సెక్స్ సీన్స్‌తో పాటు నగ్నంగా కూడా నటించారు కదా.. ఇందులో కూడా అలాంటి పాత్రే చేస్తారేమో అని వచ్చినట్లు చెప్పాడని తెలిపింది రాధిక.

ఆ దర్శకుడి జవాబు విన్న తర్వాత తాను షాక్ అయ్యానని.. ఈ దేశంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో సినిమా తీస్తానని వచ్చిన మరో దర్శకుడు తనది ముఖ్యమైన పాత్రని చెప్పాడని.. ఓ మహిళపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు ఆమె కూడా రేపిస్ట్‌గా మారిపోతుందనే ఓ పిచ్చి కాన్సెప్ట్ చెప్పాడని తెలిపింది. దాంతో ఆ కథలను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది రాధిక.

ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. బ‌య‌టి సినిమాల్లో కూడా న‌గ్నంగా న‌టించ‌డం అనేది త‌ప్పేం కాదు.. సీన్ డిమాండ్ చేసిన‌పుడు అలా న‌టించ‌డం త‌ప్పేం కాద‌ని చెబుతుంది ఈ భామ‌. ముఖ్యంగా త‌న వ‌ర‌కు అలా క‌నిపించ‌డం అస్స‌లు ఇబ్బంది కాద‌ని.. త‌న బాడీతో త‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఉంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా అంటుంది రాధిక. కేవలం సెక్స్ చేయడానికి మాత్రమే తాను ఇండస్ట్రీకి రాలేదు కదా అంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu