టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున మల్టీస్టారర్లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు . ఇటీవలె దేవదాస్‌తో పలకరించిన నాగ్.. అటు బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ‘మన్మథుడు2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
‘చి.ల.సౌ’తో డైరెక్టర్‌గా మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు2 ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటొంది చిత్ర యూనిట్. నాగ్‌కు సంబంధించిన ఓ షాట్‌ను రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ట్విటర్లో నాగ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఫిట్‌నెస్‌లో ఈ మనిషి.. అంటూ దండం పెడుతూ.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్యపాత్రను పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Working Stills of Director @23_rahulr 's next starring Charming star @iamnagarjuna ! #RahulRavindran #Nagarjuna #Telugu #Tollywood pic.twitter.com/Zf2hP84Hyk
— Mediakarann (@Mediakarann) April 18, 2019