అక్కినేని కాంపౌండ్‌లో సమంత.. వైరల్‌


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత భర్త చైతన్యతో విడిపోయాక మరోసారి అక్కినేని కాంపౌండ్ లో అడుపెట్టింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే సామ్ అక్కడికి వెళ్లడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సామ్ వెళ్ళడానికి వ్యక్తిగత కారణం లేదని, ఆమె తన సినిమా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శకుంతల- దుశ్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ డబ్బింగ్ పనులను మొదలుపెట్టింది. డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లిన సామ్ తన పార్ట్ ని పూర్తిచేసి వచ్చిందట.. అయితే ఈ విషయం అంతా చడీచప్పుడు కాకుండా జరిగిపోయిందని తెలుస్తోంది. సామ్ సైలెంట్ గా వచ్చి తన పని ముగించుకొని వెళ్లిందట.. నాగచైతన్యతో విడాకుల తరువాత అక్కినేని కాంపౌడ్ లో అడుగుపెట్టడం.. హాట్ టాపిక్ గా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates