HomeTelugu Trendingబాలయ్యతో రాహుల్ సంకృత్యాన్ మూవీ?.. కాంబో కుదురుద్దా

బాలయ్యతో రాహుల్ సంకృత్యాన్ మూవీ?.. కాంబో కుదురుద్దా

Rahul Sankrityan With Nanda

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నాడు. పైగా భగవంత్ కేసరి అంటూ హిట్టు కొట్టేశాడు. దీంతో మరింత జోష్ మీదున్నాడు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి అంటూ వరుసగా హిట్లు కొట్టేశాడు. దీంతో నందమూరి అభిమానులు సైతం మంచి ఫాంలోకి వచ్చారు. అయితే బాలయ్య ఇప్పుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగులో జరుగుతోంది. ఆ తరుబాత బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

అసలు బోయపాటి శ్రీను నెక్ట్స్ మూవీపై ఎన్నో అనుమానాలున్నాయి. ఏ ప్రొడక్షన్ హౌస్‌తో పని చేస్తాడా? అన్నది తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. బాలయ్య నెక్ట్స్ మూవీ లైనప్ గురించి చర్చలు జరుగుతున్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింఘ రాయ్ సినిమాలతో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యాన్‌తో బాలయ్య ఓ మూవీని చేస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి.

రాహుల్ చెప్పిన లైన్ బాలయ్యకు నచ్చిందని, పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది.. అప్పటి వరకు ఇంకెన్ని మార్పులుంటాయి.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. ఈ మూవీపై బాలయ్య గానీ రాహుల్ సంకృత్యాన్ గానీ ఇంత వరకు ఓ హింట్ కూడా ఇవ్వలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu