పవన్‌తో జతకట్టనున్న మలయాళ బ్యూటీ!


పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళ చిత్రం “అయ్యప్పనమ్ కోషియం” రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట సాయిపల్లవి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ కుదరకపోవడంతో నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది నిత్యామీనన్‌. ఈ చిత్రంలో మరో హీరో రానా కూడా నటిస్తున్నారు. ఆయనకు జతగా నటించేందుకు కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో నటిస్తే నిత్యామీనన్‌ మళ్లీ టాలీవుడ్‌లో ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిల్లా రంగా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates