HomeTelugu Trending'సినిమా బండి' ట్రైలర్ విడుదల

‘సినిమా బండి’ ట్రైలర్ విడుదల

Cinema Bandi Trailer

బాలీవుడ్ దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా తెలుగులో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా బండి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. ట్రైలర్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది. ఆటో డ్రైవర్‌కు తన ఆటోలో ప్రయాణికుడు మరిచిపోయిన ఖరీదైన కెమెరా దొరుకుతుంది. పెద్ద హీరోల సినిమాలు ఇలాంటి కెమెరాలతోనే తీస్తారు. మనం ఎందుకు సినిమా తీయకూడదని ఆలోచిస్తాడు. సినిమా ఎలా తీయాలో తెలియని పల్లెటూరి జనంతో సినిమా తీసేందుకు వాళ్లు పడే అవస్థలు అందరినీ నవ్విస్తాయి. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి క్యారెక్టర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది. అయితే ఈ సినిమా మే 14 ఓటీటీలో విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu