HomeTelugu Trending'సలార్‌' మూడు రోజుల వసూళ్లు 402 కోట్లు

‘సలార్‌’ మూడు రోజుల వసూళ్లు 402 కోట్లు

Salaar movie 3 days collect

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సలార్‌’. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండియా అంతటా మారు మ్రోగిపోతుంది. ప్రభాస్‌ మరోసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లో రూ.402 కోట్ల వ‌సూళ్లు రాబట్టింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రానున్న రెండు రోజులు కూడా క్రిస్మ‌స్, బాక్సింగ్ డే అవ్వ‌డంతో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవకాశముంది. కేవలం మూడు రోజుల్లో 402 కోట్ల రూపాయలు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో లాంగ్ రన్ లో 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu