HomeTelugu Trending'సలార్‌' ఫస్ట్‌ టికెట్‌ కొనుగోలు చేసిన రాజమౌళి

‘సలార్‌’ ఫస్ట్‌ టికెట్‌ కొనుగోలు చేసిన రాజమౌళి

Rajamouli bought first ticపాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌లార్’. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌ల‌యాళ స్టార్ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్ర‌వారం కర్ణాటకలో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ సినిమా తొలి టిక్కెట్‌ను టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్ల‌డించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్‌లో భారీ ధరకు ఫస్ట్ టికెట్ ను బుక్ చేసుకున్నారు టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజమౌళి.

ఈ టికెట్ ధ‌ర చూసుకుంటే.. అక్షరాలా 10,116 రూపాయలు అని స‌మాచారం. ఇక రాజమౌళి ఫస్ట్ టికెట్‌ను ఇంత ధరకు కొనడంతో.. ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu