HomeTelugu Big Storiesరాజమౌళి ఓకే చెప్పడంతో చిరు హ్యాపీ..!

రాజమౌళి ఓకే చెప్పడంతో చిరు హ్యాపీ..!

2 9
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్‌ ఓ ప్రత్యేక పాత్ర చేయబోతున్నట్టు తెలిసిందే. అయితే ఆ పాత్రకు రాజమౌళి ఒప్పుకుంటేనే అది జరుగుతుందని చిరంజీవి అన్నారు. ఎందుకంటే రాంచరణ్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్నాడు కదా. రాంచరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలంటున్నారు.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిరంజీవి 152వ మూవీ ఆచార్యలో రాంచరణ్‌ నటించేందుకు రాజమౌళి ఓకే అన్నట్టు సమాచారం. దీనికోసం 3 వారాలు డేట్స్ చిరంజీవి సినిమా కోసం కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతటా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిరంజీవి కూడా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకున్నట్టు స్వయంగా వెల్లడించారు. తన సినిమాలో రాంచరణ్‌ డేట్స్ అడ్జస్ట్ కావడం, రాజమౌళి కూడా సహకరించడంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu