HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్ ఇదేనా‌.. ఈ నెలలోనే అప్డేట్

ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్ ఇదేనా‌.. ఈ నెలలోనే అప్డేట్

4 1
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు సమయం పడుతుంది కాబట్టి ఈ సినిమాను జులై 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 కి విడుదల తేదిని మార్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఈ నెలలో అప్డేట్స్ రాబోతున్నాయి.

ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ అన్నది వర్కింగ్ టైటిల్ మాత్రమే. సినిమా టైటిల్ విషయంలో రాజమౌళి అనేక ఆలోచనలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై రాజమౌళి ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. స్వాతంత్ర కాలానికి సంబంధించిన సినిమా కావడంతో దీనికి రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu