HomeTelugu Trendingకేసీఆర్ గారికి కృతజ్ఞతలు: రాజమౌళి

కేసీఆర్ గారికి కృతజ్ఞతలు: రాజమౌళి

2 8
సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, ఉపాధి సిద్ధమైందని అన్నారు.

“తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. మా విజ్ఞప్తి మేరకు తిరిగి పనుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పందించి పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టారు. ఇప్పుడిక బాధ్యత మాపై ఉంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సిఫార్సులను అమలు చేస్తూ, తిరిగి పనిలో దిగాల్సిన సమయం. ఉపాధి సిద్ధమైంది” అని అన్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu