హీరోగా రాజమౌళి తనయుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాం. వీరిలో చాలా మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తవారిని సినీ కళామతల్లి ఆదరిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో అవ్వడానికి సిద్ధమైపోతున్నాడు.

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ అతి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కార్తికేయ కూడా తన తండ్రిలానే దర్శకుడు అవుతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లు ఆయన దర్శకత్వశాఖలోనూ, పబ్లిసిటీ విభాగంలోనూ నైపుణ్యాన్ని సంపాదించాడు.

ఉన్నట్లుండి ఇప్పుడు హీరోగా మారాలనుకున్న కార్తికేయ దాని కోసం నటనలో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా..? లేక మరో దర్శకుడితో కార్తికేయ సినిమా ఉంటుందా..? అనే విషయాల్లో స్పష్టత రావాల్సివుంది.