HomeTelugu Trendingఇద్దరు హీరోల అపూర్వ కలయిక

ఇద్దరు హీరోల అపూర్వ కలయిక

Kamal and Rajiniతమిళ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్. వీరిద్దరూ ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన విధానం ఫ్యాన్స్ ఎప్పటికి మరచిపోలేరు.

బాలచందర్, భారతిరాజా వంటి దర్శకులతో ఈ ఇద్దరు చేసిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక దాదాపు ఇద్దరు స్టార్ ఇమేజ్ ఒకేసారి పెరిగుతూ వచ్చింది.

రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కూడా వారి సినిమా జీవితంలో ఎంతో స్నేహంగా కొనసాగుతూ వస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. రజినీకాంత్, కమల్ హాసన్ మళ్ళీ చాలా రోజుల తరువాత అనుకోకుండా కలుసుకున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ 170వ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జ్ఞాన్‌వేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్ హాసన్ కూడా లైకా ప్రొడక్షన్‌లో ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు. ఇటీవల లైకా ప్రొడక్షన్స్ ఒకే స్టూడియోలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను చేస్తుండగా గ్యాప్‌లో రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా కలుసుకున్నారు.

పరస్పరం వారి సినిమాలకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా లైకా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో ఇరు వర్గాల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక చాలాకాలం తర్వాత ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ లను అందుకున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu