HomeTelugu Trendingరజనీకాంత్ జైలర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

రజనీకాంత్ జైలర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

Jailer second song
తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాజా మూవీ `జైలర్‌`. ఆగస్ట్ 10న రిలీజ్‌ కాబోతుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. ఇప్పటికే ఈసినిమాలోని మొదటి పాట విడుదలైంది. `కావాలయ్యా` అంటూ సాగే పాట దుమ్ములేపింది.

హీరోయిన్‌ తమన్నా ఇందులో నర్తించడం హైలైట్‌గా నిలిచింది. మొదట నెగటివ్‌ టాక్‌ వచ్చినా, తమన్నా అందాలు, ఆమె కొత్త గెటప్‌, ఆమె ఊరమాస్‌ డాన్సు ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అది ట్రెండింగ్‌ కావడమే కాదు, రీల్స్ తోనూ అదరగొడుతుంది.

తాజాగా జైలర్ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. `హుకుమ్‌` అంటూ సాగే ఈ సెకండ్‌ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ సాంగ్‌ను విక్టరీ హీరో వెంకటేష్‌ లాంచ్‌ చేశారు. ఇందులో రజనీకాంత్‌ జైలర్‌గా నటిస్తున్నారు. ఆయన విలన్లను హెచ్చరిస్తూ హుకుమ్‌ జారీ చేస్తున్న సమయంలో ఈ పాట వస్తుంది.

రజనీ మార్క్ హీరోయిజాన్ని చాటి చెప్పేలా ఈ పాట సాగింది. ఆయన్ని ఎలివేట్‌ చేసేలా ఈ పాట అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతారు. పాటలో రజనీ పవర్‌ఫుల్‌ క్లిప్స్ బాగున్నాయి.

జైలర్ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్టర్. మోహన్‌లాల్‌ అతిథి పాత్ర చేస్తున్నఈ మూవీలో శివరాజ్‌ కుమార్‌, సునీల్, రమ్యకృష్ణ, జాకీష్రాఫ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ రకంగా ఇదొక పెద్ద మల్టీస్టారర్‌ మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే ఆయా స్టార్స్ నిడివి తక్కువగానే ఉండబోతుందట.

యాక్షన్‌ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన బాణీలు సినిమాకి ప్లస్ కాబోతున్నాయి. దీనికితోడు రజనీకాంత్ లుక్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అదే సమయంలో పవర్‌ఫుల్‌గానూ కనిపిస్తున్నారు.

సన్‌ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రజనీ సరసన తమన్నా హీరోయిన్. తొలిసారి ఈ జంట వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుందట. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 10న జైలర్ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ మల్టీఫ్లెక్స్ రిలీజ్‌ చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu