అంధకారం టీజర్ విడుదల


పూజా రామచంద్రన్ కీలక పాత్రలో ‘అంధకారం’ ఓ సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పణలో సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి వి.విజ్ఞరాజ‌న్ ద‌ర్శక‌త్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుద‌ల చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంద‌ని నిర్మాత‌లు సుదాన్, ప్రియ అట్లీ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో అర్జున్ దాస్, వినోత్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను ప్రముఖ సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభ‌కాంక్షలు తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates