HomeTelugu Big Storiesఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..

ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..

Rajinikanth and mohan babu
కోలీవుడ్‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ మంచి స్నేహితులు అనే విషయం అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. 35 రోజుల షూటింగ్‌ తర్వాత షెడ్యూల్‌ పూర్తి కాగానే హైద‌రాబాద్‌లోని తన మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో గ‌డిపారు. స్నేహితుడితో కలిసి బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు. అక్క‌డి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో ర‌జనీకాంత్‌, మోహ‌న్‌బాబుతో క‌లిసి దిగిన ఫోటోల‌ను హీరో మంచు విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..’ ఇద్దరూ వైట్ అండ్ వైట్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అదిగాక ఇంకాస్త యంగ్‌గా కూడా కనిపించడం విశేషం అయితే ఇద్దరూ స్టైల్ పరంగా అసలు తగ్గలేదు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu