HomeTelugu Big Storiesరజనీకాంత్‌ సినిమా షూటింగ్‌కి కరోనా ఎఫెక్ట్‌

రజనీకాంత్‌ సినిమా షూటింగ్‌కి కరోనా ఎఫెక్ట్‌

Rajinikanth Annaatthe mov
సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్ ప్రస్తుతం ‘అణ్ణాతే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. దానికి కారణం చిత్ర బృందంలో దాదాపు ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో సినిమా షూటింగ్‌ను తాత్వాలికంగా నిలిపివేశారు. వారిలో ఒకరు హీరో రజనీకి క్లోజ్‌ అని తేలింది. దాంతో రజనీ హోం క్వారంటైన్ నిబంధనలు పాటించనున్నారు. సిరుతై శివ దర్వకత్వంలో సినిమా షూటింగ్ తమ నూతన షెడ్యూల్ ప్రకారం గతవారం ప్రారంభం అయింది. ఈ సినిమాను త్వరగా రూపొందించాలని చూస్తున్నారు.

దానికి కారణం రజనీ కొత్తగా పెట్టిన సొంత పార్టీతో ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. దాంతో అణ్ణాతే చిత్ర యూనిట్ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేసేందుకు కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతోంది. దాంతో ఎన్నికల కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. ఇటువంటి సమయంలో ఈ సంఘటన జరగడం పెద్ద
అడ్డంకిగా మారే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇది ఒక రూరల్ డ్రామాగా రూపొందతోంది. ఈ సినిమాలో లేడీ స్టార్ హీరోయిన్ నయనతారా, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu