HomeTelugu Big Storiesఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయిన రజనీకాంత్‌

ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయిన రజనీకాంత్‌

Rajinikanth discharge from
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజనీ.. ఆదివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో మరోసారి పరీక్షలు నిర్వహించి.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రజనీకి చేసిన అన్ని వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్‌గా వచ్చాయని వైద్యులు తెలిపారు. రజనీ పూర్తిగా కోలుకున్నారని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్‌ అనంతరం హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై బయలుదేరనున్నారు. అతని వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.

apolo

Recent Articles English

Gallery

Recent Articles Telugu