HomeTelugu Big Storiesబై సెక్సువల్‌ పాత్రలో సమంత

బై సెక్సువల్‌ పాత్రలో సమంత

Samantha announces hollywoo

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే చిత్రంతో సామ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది సమంత.

Samantha 1 1

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కించనున్న ఇంగ్లిష్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘‘పూర్తిగా సరికొత్త ప్రపంచం.. ‘అరెంజ్‌మెట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ ఫిలిప్‌ జాన్‌. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ‘‘ఇండియాలో గొప్ప నటి సమంత. ఇప్పుడు దేశాన్నే గర్వపడేలా చేయనుంది’’ అని ట్వీట్‌ చేయగా.. ‘‘తప్పకుండా’’ అని రిప్లై ఇచ్చారు.

Samantha 2 1

భారత రచయిత తిమేరి ఎన్‌ మురారీ రచించిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా చేసుకుని ఈసినిమా తెరకెక్కనుంది. ఇందులో ఆమె బై సెక్సువల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2009లో విడుదలైన ‘ఏమాయ చేసావే’ సినిమా తర్వాత ఆమె ఈ సినిమా కోసమే ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆడిషన్స్‌లో పాల్గొనడం ఎంతో కంగారుగా అనిపించిందని సామ్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. మరోవైపు.. ‘సూపర్‌డీలక్స్‌’, ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ల్లో సమంత బోల్డ్‌ రోల్స్‌లోనే కనిపించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu