భారత సినిమాలో చరిత్ర సృష్టించిన అమితాబ్‌ బచ్చన్

బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం అమితాబ్ చెహరే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రూమీ జఫేరీ దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బితోపాటు ఇమ్రాన్‌ హష్మీ, కృతి కర్భందా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమా కోసం ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పనిచేస్తున్నారు. 4 జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ఈ సినిమా సెట్‌లో బిగ్‌బి నటన చూసి ఆశ్చర్యపోయారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు.

ఇవాళ అమితాబ్‌ బచ్చన్‌ భారత్‌ సినిమాలో మరో చరిత్ర సృష్టించారు. చెహరే సినిమా తొలి షెడ్యూల్‌లో చివరి రోజు షూట్‌లో అమితాబ్‌ 14 నిమిషాల సన్నివేశాన్ని ఒక్క షాట్‌లో చేసేశారు. సీన్‌షూట్‌ పూర్తయిన తర్వాత మొత్తం చిత్ర బృందం నిల్చుని చప్పట్లు కొట్టారు. డియర్‌ సర్‌.. అనుమానమే లేదు.. ఈ ప్రపంచంలోని ఉత్తమ నటుల్లో మీరొకరు అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు సెట్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.