HomeTelugu Trendingరజనీకాంత్‌ హెల్త్‌పై బులిటెన్‌ విడుదల

రజనీకాంత్‌ హెల్త్‌పై బులిటెన్‌ విడుదల

Rajinikanth health bulletin

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తాజాగా రజనీ ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.

‘‘రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే. అయితే, ఆయన మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించాం. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించాం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. త్వరలోనే రజనీకాంత్‌ డిశ్చార్జ్‌ అవుతారు’’ అని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

rajini health bulletin 0

Recent Articles English

Gallery

Recent Articles Telugu