HomeTelugu Trendingలాంబోర్గి‌నీలో రజనీకాంత్ ఫొటో, వీడియో.. వైరల్‌

లాంబోర్గి‌నీలో రజనీకాంత్ ఫొటో, వీడియో.. వైరల్‌

Rajinikanth in lamborghini

సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖానికి ఎన్95 మాస్కు ధ‌రించి వైట్ అండ్ వైట్‌లో లాంబోర్గినీ కారులో హుషారుగా వెళుతున్న ర‌జ‌నీ మీడియా కంట‌ప‌డ్డారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మిళ‌నాడులో మ‌రీ ముఖ్యంగా చెన్నై మ‌హాన‌గ‌రంలో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ప‌నివారు ఎవరు ప‌ని చేయ‌డానికి ఇల్లు వ‌దిలి బ‌య‌టికి రావ‌డం లేదు. దీంతో స్టార్సే బ‌య‌టికి వెళ్లి వ‌స్తున్నారు. ర‌జ‌నీ కూడా గ్రోస‌రీస్ కోసం లాంబోర్గినీ RT Max కారులో వెళ్లార‌ట‌. ఈ వార్త బ‌య‌టికి రావ‌డం, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. త‌లైవా లాంబోర్గీనీలో బ‌య‌టికి రావ‌డానికి గుర్తించిన ఫ్యాన్స్ #LioninLomboghini అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu