HomeTelugu Trendingజైలర్‌ మూవీ అప్డేట్‌

జైలర్‌ మూవీ అప్డేట్‌

Rajinikanth

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఒక జైలు చుట్టూ .. జైలర్ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. టైటిల్ పరంగా .. రజనీకాంత్ లుక్ పరంగా ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.

గత కొంతకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా, షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి రజనీకాంత్ కేక్కట్ చేశారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన తమన్నా కూడా ఈ సందడిలో పాలుపంచుకుంది. ఆ సమయంలో తీసిన ఫొటోలు ఇప్పుడు అభిమానులలో హుషారును రేకెత్తిస్తున్నాయి.

రజనీకాంత్ – రమ్యకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలం తరువాత వీరి కాంబో రిపీట్‌ కావడంతో… ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో శివరాజ్ కుమార్ .. జాకీ ష్రాఫ్ కనిపించనున్నారు. మోహన్ లాల్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. ఆగస్టు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu